భూమా రాజకీయ నాయకుడే కాదు..నిర్మాత కూడా

0
99

bhuma

నంద్యాల ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దివంగత భూమా నాగిరెడ్డి రాజకీయ నాయకుడిగానే అందరికి తెలుసు కాని ఆయన సినిమాలను సైతం నిర్మించారన్న విషయం కొందరికి మాత్రమే తెలుసు. నాగిరెడ్డి రాజకీయాలకు మాత్రమే పరిమితం కాలేదు. తెలుగు చిత్ర పరిశ్రమతో ఆయనకు ఎప్పటి నుంచో అనుబంధం ఉంది. వీరబ్రహ్మేంద్ర కంబైన్స్ మూవీ క్రియేషన్స్ పేరుతో భూమా పలు చిత్రాలను నిర్మించారు. తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో వచ్చిన “నా కూతురు” సినిమాతో పాటు సుమన్ కథానాయకుడిగా నటించిన కొన్ని సినిమాలను భూమా నిర్మించారు. టాలీవుడ్ టాప్ స్టార్స్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ఆయనకు మంచి మిత్రులు. దర్శకులు రాఘవేంద్రరావుతో కూడా ఆయన సన్నిహితంగా మెలిగేవారు.

LEAVE A REPLY