రక్షణమంత్రి పదవికి పారికర్ రాజీనామా

0
69

parrikar

కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అనూహ్య నిర్ణయాన్ని తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. గోవా రాజకీయాల్లోకి తిరిగి ఆయన వెళ్లనున్నారని, సీఎం అభ్యర్థిగా పారికర్‌ను ఎంపిక చేశారని గత కొద్ది రోజులుగా కథనాలు వస్తున్న నేపథ్యంలో మనోహర్ రాజీనామా ప్రాధాన్యతను సంతరించుకుంది. మనోహర్ పారికర్‌ను ముఖ్యమంత్రిగా చేయాలంటూ గోవా బీజేపీ శాసనసభాపక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది. అమిత్ షా కూడా ఆ తీర్మానానికి ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం గోవా ముఖ్యమంత్రిగా పారికర్‌ పేరును ప్రకటించే అవకాశం ఉంది.

LEAVE A REPLY