మా కుటుంబంలో మరో సభ్యుడ్ని కోల్పోయాం: వైఎస్ జగన్

0
130

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 53 సంవత్సరాల వయస్సులో మూడోసారి గుండెపోటుకు గురైన భూమా తుది శ్వాస విడిచారు. ఆయనకు అప్పటికే బైపాస్ సర్జరీ చేసుకున్నా ఫలితం లేకపోయింది. ఆయన మృతిపట్ల వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీరని లోటని జగన్ వ్యాఖ్యానించారు. మా కుటుంబంలో మరో సభ్యుడ్ని కోల్పోయామని జగన్ చెప్పడం గమనార్హం.

ఇప్పటికే శోభాను కోల్పోయాం.. రెండేళ్ల వ్యవధిలోనే భూమాను కోల్పోవడం తీవ్ర బాధాకరమన్నారు జగన్ తల్లి విజయమ్మ. కాగా సోమవారం ఆళ్లగడ్డలో జరిగే భూమా అంత్యక్రియలకు జగన్ తన కుటుంబ సభ్యులతో హాజరుకానున్నారు. ఆయనతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొననున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మరణాంతరం కుంగిపోయిన భూమా నాగిరెడ్డి రెండు సార్లు గుండెపోటుకు గురయ్యారు. ఆమె మరణాంతరం భూమా రైట్ హ్యాండ్ పోయినట్లుయ్యింది. అన్నీ సక్రమంగా ఉన్నా అంగవైకల్యం ఉన్నవారిగా భూమా జీవితం గడిపారని ఒకనొక సందర్భంగా ఆయన నోటితోనే చెప్పారు కూడా.

LEAVE A REPLY