భూమా నాగిరెడ్డి రాజకీయ ప్రస్థానం..

0
134

రాయలసీమలో ఫ్యాక్షన్‌‌ పేరెత్తితే మొదట గుర్తొచ్చేది కర్నూలు, అనంత జిల్లాలు. పీవీ నర్సింహారావు, ఎన్టీఆర్ హయాంలో చక్రం తిప్పిన నేతల్లో ఎక్కువ మంది కర్నూలు జిల్లా వాసులు కావడం గమనార్హం. వారిలో చెప్పుకోదగ్గ ఏకైక నాయకుడు భూమా నాగిరెడ్డి. ఫ్యాక్షన్ రాజకీయాలే కాదు అనుచరులు, కార్యకర్తలకు అండగా ఉండి ఏ అర్ధరాత్రి అయినా సరే ఇంటి డోర్ తట్టి అన్నా అంటే చాలు నేనున్నా అంటూ ముందుకొచ్చేవారు భూమా నాగిరెడ్డి. అలాంటి వ్యక్తి మరణం రాయలసీమ రాజకీయాల్లో మరిచిపోని గురుతు.

జననం: భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మల ఆఖరి కుమారుడు భూమా నాగిరెడ్డి. జనవరి 1/1964 లో జన్మించారు. మొదట వీరి స్వగ్రామం కర్నూలు జిల్లాలోని డబ్ల్యూకొత్తపల్లె, దొర్నిపాడు మండలం. ఇంటర్ వరకు స్థానికంగా ఉన్న ప్రైవేటు స్కూల్ లో చదివిన ఆయన పై చదువులకోసం బెంగళూరు వెళ్లారు. భూమా నాగిరెడ్డిని డాక్టర్ చేయాలన్నదే ఆయన తండ్రి కోరిక.. డాక్టర్ చదవాలని భూమా కోరిక. అప్పటికే ఫ్యాక్షన్‌‌తో రాయలసీమ జిల్లాలు రక్తం ఏరులై పారుతోంది. భూమా బాలిరెడ్డి కూడా ఫ్యాక్షన్‌లో ఫుల్‌‌గా మునిగివున్నారు. అందుకే తనలాగా బిడ్డలు కూడా బాధపడకూడదని ఊరికి, ఫ్యాక్షన్‌‌కు చాలా దూరంగా పెట్టిన బాలిరెడ్డి ఆఖరికి ప్రత్యర్థుల చేతిలో హత్య గావించబడ్డారు. దీంతో చదవు మధ్యలోనే ఆపేసి ఇంటికి వచ్చేయాల్సి వచ్చింది. అప్పట్నుంచి ఇక రాజకీయ రంగంలోకి ప్రవేశించిన భూమా వరుసగా ప్రత్యర్థులను ఏరేపనిలో బడ్డారు. అతి పిన్న వయస్సులోనే కేవలం 20 సంవత్సరాలకే రాజకీయాల్లోకి ప్రవేశించారు భూమా.

భూమా రాజకీయ ప్రస్థానం..
1986, 1990లలో ఆళ్లగడ్డ మండల అధ్యక్షులుగా ఉన్నారు. మొదట ప్రెసిడెంట్‌‌గా రాజకీయ జీవితం టీడీపీ నుంచే ప్రారంభించిన ఆయన 1992లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆరుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్నుంచి అటు పార్టీలో, ఇటు జనాల్లో మంచి పేరు తెచ్చుకున్న భూమా నాగిరెడ్డి ఓ రేంజ్‌‌‌‌లో ఉన్నారు.

పీవీ నర్సింహారావును ఎదిరించిన భూమా..
1996లో నాటి కాంగ్రెస్ పార్టీ నంద్యాల లోకసభ అభ్యర్థి పీవీ నర్సింహా రావును రంగంలోకి దింపింది. అయితే ఆ సమయంలో ఆయన ధీటుగా ఆయన్ను ఎదుర్కోనే నేత ఎవ్వరూ టీడీపీ దొరకలేదు. అప్పుడు భూమా నాగిరెడ్డి పేరు ప్రస్తావనకు రావడంతో ఆయన్ను పోటీకి దింపాలని పార్టీ పెద్దలు దృఢ నిశ్చయం తీసుకున్నారు. అయితే భూమా నాగిరెడ్డి.. పీవీపై ఘోరంగా ఓడిపోయారు. అనంతరం పీవీ రాజీనామా చేయాల్సి వచ్చంది. దీంతో అదే స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ రంగయ్య నాయుడిపై అలవోకగా నాలుగు లక్షల ఓట్ల తేడాతో గెలిచి లోక్ సభకు వెళ్లారు. అప్పటికే భూమాకు ఫాలోయింగ్ ఓ రేంజ్‌‌లో పెరిగింది.. అంతే కాదు భూమా కోసం పనిచేసే.. ప్రాణాలిచ్చే స్థాయిలో అనుచరులు ఉన్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి.

గంగులపై గెలుపు..
కర్నూలు రాజకీయాలను శాసించేంది మూడే మూడు కుటుంబాలు భూమా, గంగుల, శిల్పా. 1999 నాటికి శిల్పా బ్రదర్స్ పేరు పెద్దగా వినబడకపోయినా గంగుల, భూమా ఫ్యామిలీ మధ్య పెద్ద స్థాయిలో వ్యతిరేకత సాగుతూ వచ్చింది. అధికార పార్టీలోకి ఒకరుంటే ప్రత్యర్థి పార్టీలో మరొకరు ఉంటూ వచ్చారు. ఇలా 1999లో ఆళ్లగడ్డ నుంచి టీడీపీ పార్టీ తరపున పోటీచేశారు. ప్రత్యర్థి గంగుల కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. గంగుల కుటుంబం నుంచి పోటీ చేసిన వ్యక్తిపై కేవలం 72వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

Related imageఇలా భూమా కుటుంబానికి టీడీపీతో.. దశాబ్దాల అనుబంధం సాగుతూ వచ్చింది. అయితే 2008లో భూమా ఫ్యామిలీ నుంచి శోభా నాగిరెడ్డి రాజకీయాల్లోకి దిగారు. అప్పటికే ముగ్గురు అన్నయ్యలు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి ఫ్యాక్షన్ గొడవల్లో మరణించడంతో పగ పెంచుకున్నారు. ప్రత్యర్థులను ఏరిపారేస్తూ ఇటు రాజకీయాల్లో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఇక భూమా శోభానాగిరెడ్డి కూడా తన రాజకీయానికి తోడవ్వడంతో కర్నూలు రాజకీయాల్లో ప్రత్యర్థులు భూమా కుటుంబానికి అడ్డెవ్వరూ లేకపోయారు. వీళ్లిద్దరూ ఏ నియోజక వర్గం నుంచి నిలబడినా గెలుపు మనదే అన్న స్థాయికి ఎదిగారు.

Related imageపీఆర్పీతో శోభా రాజకీయ రంగ ప్రవేశం..
2008 సంవత్సరంలో మెగస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు శోభా నాగిరెడ్డి పీఆర్పీలో చేరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీని విలీనం చేశారు. వైఎస్సార్ మరణాంతరం భార్య శోభతో కలిసి వైఎస్సార్సీపీలో చేరారు. అప్పట్నుంచి వైఎస్ కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్నారు. శోభా నాగిరెడ్డి జగన్ ఫ్యామిలీలో ఒకరుగా కలిసిపోయారు. 2014లో శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. అనంతరం ఆళ్లగడ్డ నియోజక వర్గం నుంచి అఖిల ప్రియను నిలబెట్టారు. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల భూమా నాగిరెడ్డి, అఖిల ప్రియ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

Related imageఆళ్లగడ్డ అంటే భూమా, భూమా అంటే ఆళ్లగడ్డ
ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మంత్రి పదవి కోసమే భూమా టీడీపీలోకి చేరారు. ఎన్నో ఏళ్లుగా నియోజక వర్గం అభివృద్ధికి నోచుకోలేదు. అందుకే పార్టీ మారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుందామని పార్టీ మారారు.. కానీ మంత్రి పదవి మాత్రం రాలేదు. ఆఖరికి మంత్రిగా పనిచేయకుండానే భూమా తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఆళ్లగడ్డ అంటే భూమా, భూమా అంటే ఆళ్లగడ్డ పేరు గుర్తుకు వస్తుంది. కాగా భూమా దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జగత్ విఖ్యాత్ రెడ్డి(20) చదువుకుంటున్నాడు. భూమా మౌనిక ప్రస్తుతం ఎంబీబీఎస్ చదువుతోంది. అఖిల ప్రియ రాజకీయాల్లో రాణిస్తోంది.

Image result for bhuma

LEAVE A REPLY