నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఇకలేరు

0
63

Bhuma-Nagi-Reddy

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత భూమా నాగరెడ్డి గుండెపోటుతో మరణించారు. తెల్లవారు జామున ఇంట్లో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయన కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆళ్లగడ్డ ఆసుపత్రికి..అక్కడి నుంచి నంద్యాలకు తరలించారు. నాగిరెడ్డిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమించినప్పటికి ఫలితం లేదు..ఆయన శరీరం వైద్యానికి సహకరించకపోవడంతో భూమా మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ వార్త తెలుసుకున్న భూమా అనుచరులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నంద్యాల సురక్ష ఆసుపత్రికి, ఆళ్లగడ్డలోని భూమా ఇంటికి చేరుకున్నారు. 1964 జనవరి 8న కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం కొత్తపల్లిలో భూమా జన్మించారు. తండ్రి భూమా బాలిరెడ్డి, తల్లి ఈశ్వరమ్మ. మాజీ మంత్రి ఎస్వీ సుబ్బారెడ్డి కుమార్తె శోభను ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగించుకుని వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభా నాగిరెడ్డి మరణించారు.

LEAVE A REPLY