ఒక్క చిన్న ఘటనతో భూమా జీవితం మారిపోయింది.!

0
155

నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 53 ఏళ్లకే ఆయన గుండెపోటుతో మరణించడం తీవ్ర విచారమని ఆయన అనుచరులు చెబుతున్నారు. అయితే భూమా నాగిరెడ్డి రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చిందనే విషయాన్ని ఒక్కసారి చూద్దాం

భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మకు నాగిరెడ్డి చిన్నకుమారుడు. అప్పట్లో రాయలసీమలో ఫ్యాక్షన్‌‌ ఓ రేంజ్‌‌లో ఉండేది. కుటుంబ కక్షా రాజకీయాల కారణంగా బాలిరెడ్డి తన పిల్లలను వాటన్నింటినికీ దూరంగా పెట్టి పెంచారు. కర్నూలు జిల్లాలోని దొర్నిపాడులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్మిడియట్ వరకు నాగిరెడ్డిని చదివించారు. అనంతరం వైద్య విద్యను అభ్యసించడానికి బెంగళూరుకు వెళ్లారు. కాలేజీలో చేరిన కొన్ని రోజులకే భూమా తండ్రి బాలిరెడ్డిని హత్య చేశారు. దీంతో చదువుకు దూరమయ్యారు.. చిన్నతనంలోనే ఇలా జరగడంతో భూమా జీవితం మొత్తం మారిపోయింది.

1964 జన్మించిన ఆయన 1984లో రాజకీయ రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. అంటే పిన్నవయస్సులోనే (20) తొలుత సొసైటీ ప్రెసిడెంట్‌‌గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభించి ఎంపీగా కూడా పనిచేశారు. 1996 సంవత్సరంలో నంద్యాల నియోజకవర్గం నుంచి ప్రధాని పీవి నర్సింహారావుపై పోటీ చేశారు. అప్పట్నుంచి ఆయనకు మంచి పేరొచ్చింది. అప్పట్నుంచి ఇప్పటి వరకూ భూమాకు ఎదురొడ్డి నిలబడిన నేతలేరంటే ఆయన ఎంత పవర్ ఫుల్ నాయకుడో ఇట్లే అర్థం చేసుకోవచ్చు.

LEAVE A REPLY