అఖిలను మంత్రిగా చూడటానికే ఇన్నాళ్లు బ్రతికున్నా: భూమా

0
138

రాయలసీమ రాజకీయాలకు సొగసును తెచ్చిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. 35 ఏళ్లపాటు రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న భూమా మృతి కార్యకర్తలు, ఆయన అనుచరుల్లో తీవ్ర విషాదం నింపింది. భూమా ఇక లేరన్న వార్త విన్న కుమార్తె అఖిలప్రియ కుప్పకూలిపోయారు. ఆదివారం ఉదయం నుంచి వైద్యులు తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది.

Related imageకేవలం ఫ్యాక్షన్ రాజకీయాలే కాకుండా.. ప్రేమతో కూడిన రాజకీయాలు ఉంటాయి. ప్రజాసమస్యలను పట్టించుకుని నేతల్లో ఈయన ముందుంటారు. అన్నా నా ఫలానా సమస్య వచ్చిందని ఏ అర్థరాత్రి వచ్చి ఇంటి తలుపుతట్టినా మీ కోసం నేనున్నాని చెప్పే ఏకైక నాయకుడు భూమా. పార్టీ మారినా అదే ఆత్మాభిమానం, హుందాతనం తగ్గకుండా అందరితో సన్నిహితంగా మెలిగేవారు. నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూత తర్వాత ఆమె కుటుంబ సభ్యులు, అనుచరులు శోకసంద్రంలో మునిగిపోయారు.

శోభా నాగిరెడ్డి మరణాంతరం.. ఆయన చాలా కృంగిపోయారు. శోభాను అఖిల ప్రియలో చూసుకుంటున్నాను.. అఖిల రాజకీయాల్లో మంచి పొజిషన్‌లో చూస్తే చాలని భూమా నాగిరెడ్డి పలు సందర్భాల్లో చెప్పారు. అఖిల ప్రియను ఓ స్థాయిలో ఉండటం చూసి ఆ తర్వాత శోభా దగ్గరికి వెళ్లిపోయినా పర్వాలేదని చెబుతూ ఉండేవారని ఆయన అనుచరులు చెప్పారు.

శోభా గురించి మాట్లాడుతూ..
నా వాచ్ ఎక్కడుంటుందో.. నా ఫర్సులో ఎంత డబ్బులున్నాయో కూడా నాకు తెలియదు కేవలం శోభా గుర్తు చేసేది.. నన్ను ఒంటరి చేసి శోభా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ పలు సందర్భాల్లో భూమా కన్నీరుపెట్టుకున్నారు. పిల్లల కోసమే బ్రతుకుతున్నా అని చెప్పేవారు.

నాకు మంత్రి పదవి వద్దు.. అఖిలకు ఇవ్వండి..
శోభా మరణాంతరం అఖిల ప్రియను రాజకీయంగా అన్ని విధాలుగా భూమా నాగిరెడ్డి తీర్చిదిద్దారు. గత నెలలో ఆయన మాట్లాడుతూ మంత్రి పదవి తీసుకునేందుకు తాను సిద్ధంగా లేనని అఖలకు మాత్రం మంత్రి ఇస్తే అది చూడటానికి ఇంకా భూమ్మీద బ్రతికున్నానంటూ ఓ చానెల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా సమాచారం.

Image result for bhuma tdpభూమా ఆఖరి కోరిక చంద్రబాబు తీరుస్తారా.. అఖిల ప్రియను మంత్రిగా చూడాలనుకోవడమే భూమా ఆఖరికోరిక.. అఖిల ప్రియలో శోభాను చూసి అనంతరం కన్నుమూసినా పర్వాలేదని భూమా చెప్పడం గమనార్హం. పాపం ఆఖరి కోరిక తీరకుండానే భూమా తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. మరి చంద్రబాబు అఖిలను మంత్రిని చేస్తారా లేదా అన్నది వేచి చూడాల్సిందే. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిందేమిటంటే అఖిల మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. . పైగా రాజకీయ అనుభవం చాలా తక్కువ. ఒక వేళ ఇచ్చారే అనుకోండి ఎప్పట్నుంచి మంత్రి పదవి కోసం వేచి చూస్తున్న సీనియర్ల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందని పార్టీ శ్రేణులు గుసగులాడుకుంటున్నాయి.

LEAVE A REPLY