ఐదు రాష్ట్రాల్లో ఏ పార్టీకి ఎన్ని

0
113

Assembly-Election-Results-2017

మినిసంగ్రామంగా రాజకీయ విశ్లేషకులు అభివర్ణించిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ప్రాంతీయ పార్టీల హవా ఖాయమని భావించిన చోట జాతీయ పార్టీలకు ఓటరు దేవుడు పట్టం కట్టాడు.

ఏ పార్టీకి ఎన్ని స్థానాలు వచ్చాయో చూస్తే:

ఉత్తరప్రదేశ్:

దేశ రాజకీయాలను శాసించే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ఆ రాష్ట్ర ప్రజలు తిరుగులేని విజయాన్ని అందించారు. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా బరిలోకి దిగిన బీజేపీ మొత్తం 403 స్థానాలకు గానూ 325 స్థానాలను కైవసం చేసుకుని సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఎస్పీ + కాంగ్రెస్ కూటమి 54 స్థానాలను, బీఎస్పీ కేవలం 19 స్థానాలకే పరిమితమవ్వగా, ఇతరులు 5 స్థానాలను గెలుచుకున్నారు.

ఉత్తరాఖండ్:

ఉత్తరాఖండ్‌లోని మొత్తం 70 స్థానాలకు గానూ బీజేపీ 56 స్థానాల్లో గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ కేవలం 11 స్థానాలను గెలుచుకోగా..ఇతరులు రెండు స్థానాలను గెలుచుకున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి హరీష్ రావత్ పోటీ చేసిన రెండు చోట్ల ఓటమి పాలయ్యారు.

పంజాబ్:

పంజాబ్‌లో కాంగ్రెస్ బీజేపీని మట్టికరిపించింది. మొత్తం 117 స్థానాలకు గానూ 77 స్థానాలను హస్తం కైవసం చేసుకుంది. అకాలీదల్-బీజేపీ కేవలం 18 స్థానాలకే పరిమితమైంది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆప్ 20 స్థానాల్లోనూ, ఇతరులు రెండు చోట్ల గెలుపొందారు.
మణిపూర్‌లో హంగ్:

మణిపూర్ ఓటర్లు ఏ పార్టీకి స్పష్టమైన ఆధిక్యతను ఇవ్వలేదు. మొత్తం 60 స్థానాలున్న మణిపూర్‌లో కాంగ్రెస్ 28, బీజేపీ 21, ఇతరులు 11 చోట్ల గెలుపొందారు. ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిలను ఓటర్లు కన్నెత్తి కూడా చూడలేదు..ఆమెకు కేవలం 90 ఓట్లు మాత్రమే దక్కాయి. దీంతో షర్మిల రాజకీయాల్లోంచి తప్పుకున్నారు.

గోవా:

గోవాలోనూ తొలుత హస్తం గాలి వీచినప్పటికి బీజేపీ తర్వాత పుంజుకోవడంతో అక్కడ కూడా హంగ్ ఏర్పడింది. మొత్తం 40 స్థానాలకు గాను కాంగ్రెస్ కూటమి 19, బీజేపీ కూటమి 14, ఎంజీపీ కూటమి 3, ఇతరులు 4 స్థానాల్లోనూ గెలుపొందారు.

LEAVE A REPLY