హీరోయిన్, నిర్మాత పెళ్లి చేసుకోబోతున్నారు..!

0
109

WhatsApp Image 2017-03-09 at 11.32.29 PM

భావన.. మలయాళ ముద్దుగుమ్మను సినీ ప్రియులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేని పేరు. ఒక వేళ గుర్తు రాకున్నా చిన్నపాటి క్లూ ఇస్తే చాలు ఖచ్చితంగా గుర్తుపట్టేయచ్చు. ఇంతకీ ఆ క్లూ ఏంటంటే శ్రీకాంత్, భావన జంటగా నటించిన మహాత్మ సినిమాలో టింగు రంగ.. రంగ.. నీలపోరి గాజుల ఓ నీలవేణి అనే పాట చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ హీరోయినే ఈ భావన. పేరు మాత్రం తెలియకపోయినా ముఖం చూస్తే గుర్తుకొచ్చే.. గుర్తుపట్టే ముద్దుగుమ్మే భావన. భావనకు ప్రముఖ మలయాళ నిర్మాత నవీన్‌తో నిశ్చితార్థమైంది. ప్రముఖుల మధ్య ఈమె నిశ్చితార్థం జరగడం గమనార్హం. అయితే ఇంకా పెళ్లి తేదీ ఖరారు కాలేదు. ఈ నిశ్చితార్థం విషయాన్ని మూవీ ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ వ్యక్తి తన ట్విట్టర్ ఖాతా ద్వారా మీడియాకు, భావన అభిమానులకు తెలియజేశాడు.

WhatsApp Image 2017-03-09 at 11.32.37 PM

కాగా భావన, నవీన్ ఇద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు.. ఆ ప్రేమను పెళ్లిదాకా తీసుకెళ్లారు. కాగా ఈ ప్రేమికులను మెచ్చుకోవాల్సి ఉంది. ఇటీవల భావనకు జరిగిన అన్యాయం అందరికీ తెలిసిందే.. అయిననూ ఆ ప్రేమికుడు వాటన్నింటినీ లెక్క చేయకుండా ప్రేమను పెళ్లి దాకా తీసుకెళ్లాడంటే ఆషామాషీ విషయం కాదు. ఈ ఒక్క విషయంలో నవీన్‌‌ను మెచ్చుకోవచ్చు. జీవితాంతం ఇలాగే ఈ జంట ఆనందంగా గడపాలని www.fungaama.com కోరుకుంటోంది.

పెళ్లి గురించి భావన మాటల్లోనే.. మళయాళ ముద్దుగుమ్మ ఇటీవల ఓ ప్రముఖ చానల్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టింది. నవీన్ తను ఇరువురూ ప్రేమలో ఉన్నట్లు చెప్పింది. కాగా వీరిరివురూ 2014లోనే వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారట. కానీ కొన్ని అనివార్యకారణాల వల్ల అప్పట్లో పెళ్లి చేసుకునేందుకు వీలు కాలేదని ఆమె తెలిపింది.

LEAVE A REPLY