వర్మ.. మర్యాదగా క్షమాపణ చెప్పు.. లేకుంటే చెప్పులతో కొడతాం!

0
104

WhatsApp Image 2017-03-09 at 11.59.51 PM

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ.. ఈ పేరు తెలియని వారుండరు.. చిన్నపిల్లలు మొదలుకుని పండుముదుసలి వరకూ ఈ పేరు చాలా పాపులర్. ఎందుకని అంటారా.. వర్మ చేసే చిలిపి పనులు అలాంటివీ మరి. సందర్భాన్ని బట్టి వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ అందరితో బండబూతులు తిట్టించుకునే వర్మ ఇటీవల మార్చి-8 మహిళా దినోత్సవం సందర్భంగా ఆయన ట్వీట్ చేస్తూ.. అందరికీ మహిళాదినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పాడు. అంతటితో ఆగుంటే సరిపోయేదేమో కానీ మనోడికి నోటి దూల ఎక్కవ కదా.. ప్రపంచంలోని మహిళలంతా పురుషులకు పోర్న్ స్టార్ సన్నీలియోన్ లాగా సంతోషం కలిగించాలంటూ కోరుకుంటున్నా అంటూ వివాదస్పద ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ చూసిన మహిళలు, మహిళా నేతలు, నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్సీపీకి చెందిన విద్యా చవాన్ వర్మ వ్యాఖ్యలకు స్పందిస్తూ.. తప్పయిపోయిందని క్షమాపణలు చెబితే సరి లేకుంటే చెప్పులతో కొడతామంటూ గట్టిగా హెచ్చరించారు. ఈమె స్పందించిన అనంతరం చిత్రపరిశ్రమలోని కొందరు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆఖరికి వర్మ సినిమాలు బహిష్కరించాలని ఫిల్మ్ స్టూడియో సెట్టింగ్ అనుబంధ మజ్దూర్ యూనియన్ సభ్యులకు పిలుపునిచ్చింది. ఇదిలా ఉంటే వర్మపై పలు చోట్ల కేసులు పెట్టారు. ముఖ్యంగా గోవాలోని ఓ పోలీస్ స్టేషనులో మహిళా నేత ఫిర్యాదు చేసింది. వివాదస్పద వ్యాఖ్యలు చేసినందుకుగాను వెంటనే వర్మను అరెస్ట్ చేయాలంటూ ఆమె డిమాండ్ చేశారు.

సెలబ్రిటీ మొదలుకుని సందర్భాన్ని బట్టి దేవున్ని సైతం వదలకుండా అందర్నీ విమర్శించే వర్మకు మహిళా దినోత్సవం సందర్భంగా గట్టి మొట్టికాయే పడింది.. నోటి దూల తీరింది.. అందుకే ఏదైనా మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆచితూచి మాట్లాడాలని పెద్దలు అంటుంటారు. కానీ వర్మ మాత్రం వాటన్నింటినీ లెక్క చేయకుండా నా నోరు.. నా ట్విట్టర్.. నా ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నాడు. మరి ఈ దెబ్బతో అయినా వర్మ వివాదస్పద వ్యాఖ్యలు చేయడం మానుకుంటాడేమో చూడాల్సిందే.!

LEAVE A REPLY