ఆర్బీఐ మరో సంచలన నిర్ణయం.. బంగారం తాకట్టు పెడితే పైసలివ్వరట.!?

0
104

WhatsApp Image 2017-03-09 at 11.09.21 PM

నోట్ల రద్దు అనంతరం దేశంలోని అన్ని బ్యాంకులు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం బ్యాంకు నుంచి డబ్బులు తీసినా.. వేసినా సర్ చార్జీలు మోతమోగిపోతాయని ఎస్‌బీఐ, యాక్సిస్, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ మోత ఏప్రిల్ మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ బాదుడు ప్రారంభం కాకమునుపే మరో దిమ్మదిరిగే షాకిచ్చింది ఆర్బీఐ. బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎస్బీఎఫ్‌సీ) బంగారంపై ఇచ్చే రుణాలపై షరతులు విధించింది. రుణం నగదు రూపంలో రూ.20 వేలకు మించి ఇవ్వకూడదని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రస్తుతం ఎస్బీఎఫ్‌సీ ద్వారా బంగారంపై లక్ష రూపాయల వరకూ నగదు రూపంలో తీసుకునేందుకు అవకాశం ఉండేది. అంతకు మించి అయితే చెక్కు రూపంలో చెల్లిపులు జరిగేవి. అయితే ఇప్పుడు సుమారు 80వేల రూపాయిలను తగ్గించేసిన ఆర్బీఐ దాన్ని కాస్త 20వేల రూపాయలకు మాత్రమే పరిమితం చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా ప్రజలను డిజిటల్ దిశగా చెల్లింపులు చేసేలా ప్రోత్సహించేందుకు ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. ఆదాయపన్ను చట్టం 1961 ప్రకారమే నగదును లక్ష రూపాయల నుంచి 20వేలకు తగ్గించింది.

ఇది వరకే బంగారు కొనుగోలుకు లిమిట్ పెట్టిన కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇలా గోల్డ్ లోన్‌‌పై ఆంక్షలు విధించడాన్ని దేశ ప్రజలు తప్పుబడుతున్నారు. అత్యవసర సమయాల్లో లోన్లు తీసుకునేందుకు సర్కార్ షరతులు పెట్టడం సమంజసం కాదని కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఉదాహరణకు ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలోనో.. లేకుండే ఓ మహిళ డెలివరీ విషయంలో ఒకేసారి రెండు లక్షల రూపాయలు.. అంతకంటే ఎక్కువ కావాల్సి వచ్చిందనుకోండి.. కావాల్సిన నగదుకంటే ఎక్కువ విలువ చేసే గోల్డ్ ఉందనుకోండి అప్పుడు వారి పరిస్థితేంటి.. చెక్ వచ్చిందాకా వెయిట్ చేసి ఆ తర్వాత వెయిట్ చేయాల్సిందేనా.. సర్కార్, ఆర్బీఐలు మాత్రం ఇలాంటివన్నీ పరిగణనలోనికి తీసుకోకుండానే ఇష్టానుసారం నిర్ణయాన్ని తీసుకోవడం ప్రజలను భయాందోళనకు గురిచేస్తోంది.

LEAVE A REPLY