అఖిల్ పెళ్లి ఆగిపోయింది.!?

0
146

2016 ఏడాదిలో అక్కినేని ఫ్యామిలి వార్తల్లో నిలిచినంత మరేకుటుంబం కానీ.. హీరోకానీ లేదు. ఇందుకు కారణం అఖిల్-శ్రియా, సమంత- చైతూల నిశ్చితార్థం, పెళ్లి. ఉదయం లేచిన మొదలుకుని సాయంత్రం వరకూ రోజు ఈ కాబోయే జంట గురించి ఏదో ఒక వార్త హల్ చల్ చేసేది. ఇవన్నీ లేకపోతే కనీసం ట్విట్టర్‌‌లో అయినా నాలుగు ముక్కలు ట్వీట్ చేసి మిన్నంకుడిపోయేవారు ఈ ఇద్దరు తమ్ముళ్లు.
అన్నీ అయిపోయాయి.. ఎట్టకేలకు నిశ్చితార్థానికి సమయం ఆసన్నమైంది.. అనుకున్న టైంకు అఖిల్- శ్రేయా నిశ్చితార్థం అయిపోయింది. చైతూ కంటే ముందే అఖిల్ పెళ్లి చేయాలని నిర్ణయించిన అక్కినేని నాగార్జున టార్గెట్. ఒక నెల గ్యాప్‌‌లోనే చైతూ పెళ్లి కూడా చేసేసి భారం దించుకుందామనుకున్నాడు నాగ్. చైతూ – సమంతా నిశ్చితార్థం కూడా అయిపోయింది.

Image result for akhil marriageమొదట అఖిల్ పెళ్లి చేసేసి అనంతరం చైతూ పెళ్లి చేద్దామనుకున్న నాగ్ ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఇందుకు కారణమేంటో తెలియలేదుగానీ అఖిల్ పెళ్లి ఆగిపోయింది. ఇరు కుటుంబాల నుంచి ఇంతవరకూ ఎవ్వరూ స్పందించపోవడం గమనార్హం. మీడియాలో ఓ రేంజ్‌‌లో వార్తలు వస్తున్నా…. నెట్టింట్లో పుకార్లు చెలరేగుతున్నా అక్కినేని, జీవీకే ఫ్యామ్లీలు స్పందిచనే లేదు. అంతేకాదు ఎవరెన్ని పుకార్లు రేపితే మనకెందుకు అనుకున్నారేమోగానీ స్పందించడానికి మాత్రం ముందుకు రాలేదు.

Image result for akhil marriageఅసలు కారణమేంటి అఖిల్..?
అఖిల్-శ్రేయాది ప్రేమ పెళ్లి అనేది జగమెరిగిన సత్యం.. ఇద్దరూ ఇష్టపడే పెళ్లిదాకావచ్చారు.. నిశ్చితార్థం కూడా అయిపోయింది అంటే సగం పెళ్లి అయిపోయినట్లే. కానీ ఈ గ్యాప్‌‌లో వీరిద్దరి మధ్య ఏం విభేదాలొచ్చాయో కానీ ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం గానీ మెసేజ్‌‌లుగానీ ఏమీ లేవట. అసలు కారణం మాత్రం ఎవ్వరూ చెప్పలేదు.. బయటపడేందుకు సాహసించలేదు కూడా. ఎప్పుడూ సోషల్ మీడియా చురుకుగా ఉండే అఖిల్ ఈ విషయంలో స్పందించడానికి చాలా వెనకాడుతున్నాడు అంటే ఏదో జరగరాని పెద్ద తప్పే జరిగిపోయిందని నెటిజన్లు చెప్పుకుంటున్నారు. పెళ్లి తర్వాత ఇబ్బందులు పడటం కన్నా పెళ్లికి ముందే జాగ్రత్తపడటం బెటర్ అని భావించిన అఖిల్ రద్దు చేసుకున్నట్లు సమాచారం. జీవీకే, అక్కినేని కుటుంబాలకు మధ్య సాన్నిహిత్యం ఇప్పటిది కాదు నాగేశ్వర్రావ్ బ్రతికున్న రోజుల్నుంచే ఈ కుటుంబాల మధ్య సాన్నిహిత్యం ఉంది.. ఇలా పెళ్లి రద్దు చేసుకుందామని ఇరువురూ నిశితంగా చర్చించుకున్నారట.

ముఖ్యంగా పెళ్లి రద్దు అయ్యింది అనే వ్యవహారం ఎక్కడ్నుంచే మొదలైందంటే..
అఖిల్ పెళ్లి రోమ్‌‌లో చేయాలని రెండు కుటుంబాలు నిర్ణయించారు. పెళ్లి దగ్గరపడుతుండటంతో అక్కడ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కానీ ఉన్నట్లుండి వేదికను రద్దు చేయడం.. అక్కడికి వెళ్లేందుకు ముందుగా బుక్ చేసుకున్న టికెట్లు రద్దు చేయడం వెనువెంటనే జరిగిపోయింది.

LEAVE A REPLY