చిరుకు మరో షాకిచ్చిన పవన్.!

0
103

సినీ ఇండస్ట్రీలో మెగస్టార్ చిరంజీవికి ఉన్నంత ఫ్యాన్ ఫాలోయింగ్ మరెవరికీ లేదని చెప్పడంలో ఏ మాత్రం అనుమానం లేదు. లాంగ్ గ్యాప్ తర్వాత ఖైదీ నంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుని బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించుకున్నాడు. ఇదిలా ఉంటే పవన్- చిరు కాంబినేషన్‌‌లో ఉన్న సినిమా గురించి కొద్ది రోజుల క్రితం తెగ ప్రచారం జరిగింది. అన్నదమ్ముళ్లు ఇద్దరూ కలిసి ఒకే చిత్రంలో కనిపిస్తారని మెగాభిమానులు ఆనందంలో మునిగిపోయారు. సీనియర్ నిర్మాత సుబ్బిరామిరెడ్డి ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ సినిమాకు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా ఫోన్ పట్టుకుంటాడనే న్యూస్ మూవీ లవర్స్‌లో మరింత ఇంట్రస్ట్ క్రియేట్ చేసింది.

అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌‌పై వెళుతుందనే దానిపై అటు పవన్, చిరు నుంచి గానీ, సుబ్బిరామిరెడ్డి, త్రివిక్రమ్‌లు గానీ ఇంతవరకూ క్లారిటీ ఇవ్వలేదు. దీన్ని బట్టి చూస్తే ఇప్పుడే అన్నదమ్ముల కాంబినేషన్‌‌లో సినిమా ఉండకపోవచ్చని అభిమానులు భావించారు. అయితే అసలు ఈ సినిమా ఉంటుందా లేదా అని సరికొత్త సందేహాలు మొదలయ్యాయి. ఇందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ కాంబోపై చేసిన కామెంట్సే. ప్రస్తుతం యూఎస్ టూర్‌లో ఉన్న పవన్ అన్నయ్యతో కలిసిఎప్పుడు నటిస్తారని మీడియా ప్రశ్నించగా ఎవరూ ఊహించని విధంగా పవన్ రియాక్ట్ అవ్వడం గమనార్హం.

మల్టీస్టారర్ సినిమాపై పవన్ క్లారిటీ ఇస్తాడనుకుంటే అసలు ఈ సినిమా విషయం తనవద్దకు రాలేదని చెప్పడంతో మెగాభిమానులు కంగుతిన్నారు. పవన్ మాటలనుబట్టి చూస్తే అన్నదమ్ముల సినిమా ఓ రూమర్ మాత్రమేనని తేలిపోయిందని చర్చించుకుంటున్నారు. మొత్తానికి చిరు-పవన్ కాంబో సినిమా అంత ఈజీ కాదనే విషయం పవన్ మాటలతో మరోసారి రుజువైంది. ఈ విషయం తెలుసుకున్న మెగాభిమానులు పవన్‌పై గుర్రుమంటున్నారు. పవన్ స్పందించాడు సరే ఇక మిగిలింది చిరు, త్రివిక్రమ్, సుబ్బిరామిరెడ్డే.! మరి వాళ్లు నోరు తెరిస్తే ఏం చెబుతారో అన్నది తెలియాల్సి ఉంది.

LEAVE A REPLY