రాజమౌళి మహాభారతంలో భీష్ముడిగా రజనీ..?

0
142

tollywood updates

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బాహుబలి-2 రిలీజ్‌కు రెడి అయ్యింది..ప్రజంట్ పోస్ఠ్ ప్రొడక్షన్ వర్క్‌లో బిజీగా ఉన్నాడు జక్కన్న. సరే ఆ సంగతి పక్కనబెడితే నెక్ట్స్‌  ఆయన ఏ ప్రాజెక్ట్ టేక్ చేస్తాడు..ఏ హీరోతో సినిమా ఉంటుంది అంటూ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో ఒకటే చర్చ..అయితే రాజమౌళి తన డ్రీమ్‌ ప్రాజెక్ట్  మహాభారతాన్ని తెరకెక్కించేందుకు ప్లాన్ రెడి  చేస్తున్నాడట జక్కన్న. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ రెడీ అయిందని..నటీనటుల ఎంపిక కూడా ప్రారంభించినట్లు ఫిలింనగర్‌లో చర్చించుకుంటున్నారు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏమిటంటే ఈ సినిమాలో సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓ ముఖ్యపాత్ర పోషించనున్నారట. తమిళ మీడియా అంచనా ప్రకారం భీష్ముడి పాత్ర రజనీ పోషించనున్నాడట. దీనిలో నిజమెంత ఉందో తెలియదు కానీ ఈ వార్త ఇప్పుడు కోలీవుడ్, టాలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. రాజమౌళి దర్శకత్వంలో సౌతిండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటిస్తే..పాత రికార్డులన్నీ గల్లంతే. ప్రస్తుతం రజనీ శంకర్ దర్శకత్వంలో రోబో 2.0 చేస్తున్నాడు దీని తర్వాత కబాలి-2కి కమిటయ్యాడు కబాలి.

LEAVE A REPLY