మధురం – 3

0
235
హలొవలోవలో..
ఏంటోయ్ మధురం  ఇక్కడున్నావ్..?!!
-అన్నాడు రావుగోపాలరావు
అదేమరి నేనూ అడగబోతోంది- అంది వయ్యారంగా మధురవాణి.
అదిసర్లేవో నిన్న సెగట్రీని పంపి అమెజాన్ లో కొన్న ఐఫోన్8 అందిన సంగతి కనీసం వాట్సాప్ లోనైనా సెప్పావుకాదేటి.. రాత్రంతా ఎంత ఇదైపోననో నీకేటి తెలుసు..!
అబ్బోసి.. మీరిచుకున్న అన్ని వస్తువులజాబితా ఉండాలనే గా.. ఊ.. వూ.. ఆ గొట్టం మొహం  పీలకాళ్ళ సేకరెట్రీ చేత అంపుతారన్నీనూ..
ఏం డవిరెక్టుగా ‘అమ్మేశాన్’ వాడితోనే అంపొచ్చుగా..?!
వార్నీ.. అది ‘అమ్మేశాన్’ కదునా శిలకలకొలికి.. అమెజాన్..
హ హ హ.. ఏదో ఒకటి లేస్తూ.. లొట్టిపిట్టలాంటి మీమోహన్నే ఎంప్టీవోడేసిన గిరీశం అనుకోవట్లే..!!
అని జడవూపుకుంటూ ఐఫోన్8లో ముత్యాలముగ్గు చూడసాగింది మధురవాణి..!!
—– ప్రియదర్శిని కృష్ణ

LEAVE A REPLY