మధురం – 2

0
149
ఏమోయ్ మధురం..
ఈ ట్రంపు గోలతో నాకు వీసా గొడవయ్యేలా వుంది.. ఇదుగోటి, అల్లా ఎమ్మెల్యే వేలువిడిచిన మేనమామ అత్తకూతురి మరిది అమెరికా వీసాకోసమని సెగట్రీతో చెప్పి ఓ లచ్చా ఆద్మాన్సుగా నొక్కిసిన..
ఇసయం బైటికి రాకుండా సూకోవాలా..
– అంటూ సోది మొదలెట్టిన రాఁవుగోపాల్రావు తో నిమ్మళంగా నైల్పాలిషు పెట్టుకుంటూ ఓరచూపుతో
హమ్మయ్య.. ఇంకా నేను కళ్యాణ్ జువెలర్స్ లో కొన్న కంటే డబ్బులు ఎక్కడివి అని అడిగేస్తారనుకున్న..
వీసా గొడవైనా సరే నా ‘కంటే’ నేనివ్వను.. కావాలంటే నయనతార బుచ్చెమ్మనడిగి GRTనుంచిఒక హారం తెచ్చుకుని మణప్పురంలో వెంకటేష్ ని అడిగి పెట్టుకోండి..
ఇదే మీకు ఖరాఖండిగా చెప్పడం అని మూతి తిప్పుకుంది మధురవాణి.
ఎహె ఊరుకోస్.. ట్రంపు దెబ్బకి నేనో ఇదైపోతావుంటే ‘కంటే వలనన్ పట్టీ’ అని ఇదైపోతావ్.. అక్కడ మాచ్చేడ్డ గోలగా వుంది లే.. ఇప్పుడే నే వెళ్లి ట్రంపు తో బైఠాయించి ‘ఇదిగో మామా మనలో మైనమాట, నువ్విట్టాటి తిరకాసు లేసావంటే మావోల్లు నిన్ను ఇంపీచ్మెంట్ చేసీగల్రు.. అనిచెప్పొస్తాలే.. నా బంగారం.. నా మధురం మనపురానికెందుకు గాని పోస్టాఫీసు ఖాతాలోంచి కాసిన్ని రూకలు పాడేద్దూ.. అని సవరదీస్తున్న రావుగోపాల్రావు చేతిమీద జడగంటలతో ఒకటేసి పంతులుగారొచ్చే వేళయింది పో అవతలకి మురిపెంగా అంది మధురవాణి!!!
—– ప్రియదర్శిని కృష్ణ
SHARE
Previous articleమధురం – 1
Next articleమధురం – 3

LEAVE A REPLY