మధురం – 1

0
150
డాబాపై పిట్టగోడ దగ్గర నిలుచుని పాతకాలం రైలింజన్లపై పొగగొట్టం లోంచి పొగలాగా ఉఫ్ ఉఫ్ మంటూ సిగరెట్టూ ఊదుతూ దీర్ఘంగా ఆలోచిస్తున్న రావుగోపాల్రావ్ పక్కన మెల్లగా హంసలా నడిచొచ్చి నిలుచుంది మధురం అదే అదే మన మధురవాణి..
హేమిషో.. ఈపూట మహా పరధ్యానంగా ఉన్నారూ…అంది దీర్ఘంగా చూసావా మధురం ఆకాశం ఎంత నీలంగా వుందో.. అన్నాడు గాల్లోకి చిటికేసి సిగరెట్టూ బూడిద విదులుస్తూ..
పోదురూ మీ హాస్యాలు మరేం తట్టలేదా ఏంటి ..ఉపమానాలు కరువయ్యాయి మీకు ..?! అని బుంగమూతి తో..
అధికాదేస్.. సరిగ్గా ఓపాలి సూడు నా బంగారం.. ఆకాశమంతా సముద్రమైపోయినట్లు లేదూ…?!
అబ్బా.. హ్మ్.. ఇంకెలా ఉంది..?! అంది గోముగా, పిట్టగోడమీద ఆనుకుని ఎడమచేతి చిటికెనవేలు గోటితో రాఁవుగోపాల్రావు నుదుటిమీద పడుతోన్న రింగుతో ఆడుతూ..
ఇంకెలాగంటే.. అని మళ్ళీ సాలోచనగా ఆకాశాన్ని చూస్తూ.. సముద్రం అంతా ఆకాశాన్ని మింగేసింది, సముద్రాన్నేమో జనాలు మింగేశారు మెరీనా బీచ్ లాగా..
అని గబుక్కున ఎదో గుర్తొచ్చినట్లు  మధురాంకేసి చూస్తూ చెప్పడమే మరిచానే నా గువ్వా.. రాత్రి మెరీనా బీచ్ నుండి మా పన్నీరు బావ ఫోన్ చేసాడు, నెక్స్ట్ ఎం స్టెప్ తీసుకోవాలో సలహా ఇచ్చి సాయం చమన్నాడు..
ఆల్చిప్పల్లాంటి కాళ్ళని ఇంతింతచేసి ఆశ్చర్య పోయినట్లు నటించి కిసుక్కున నవ్వి జడతో ఒక్కటిచ్చి..
హ హ హ.. హాస్యానికి హద్దులుండక్కర్లా..?! పన్నీరు కి మీరిచ్చేదేంటి మా మోడీ పంతులుగారువుండలా..?! పోదురూ పరాచికాలు అంది కిలకిలా నవ్వుతూ.
—– ప్రియదర్శిని కృష్ణ

LEAVE A REPLY