రాజ్ తరుణ్ తప్పులే వారికి ప్లస్ అయ్యింది

0
118

raj tarun

తాజాగా ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్తా మావా, కుమారి 21 ఎఫ్ లాంటి హ్యాట్రిక్ విజయాలతో దూసుకువచ్చిన యంగ్ హీరో రాజ్‌తరుణ్ ఎందుకో ఆ స్పీడ్‌ను కంటిన్యూ చేయడంలో ఫెయిల్ అవుతున్నాడు. అనుభవలేమో లేదంటే కుర్రతనమో కానీ కథల ఎంపికలో తప్పటడుగులు వేస్తున్నాడు. రీసెంట్‌గా రాజ్ వదులుకున్న రెండు సినిమాలు సూపర్‌హిట్టవ్వడంతో పాటు వసూళ్ల పంట పండిస్తున్నాయి. అవి మరేవో కాదు ఒకటి శర్వానంద్ హీరోగా వచ్చిన శతమానం భవతి, మరోకటి నాని హీరోగా వచ్చిన నేను లోకల్..ఈ రెండు సినిమాల కథలు మొదట రాజ్‌తరుణ్ వద్దకే వచ్చాయట..అయితే అతను కొన్ని మార్పులు సూచించడంతో రెండూ సినిమాలు చేజారాయట. ఆ రెండు చిత్రాలు రాజ్‌తరుణ్ అకౌంట్‌లో పడుంటే అతని కెరీర్‌ ఎక్కడికి వెళ్లేదో చెప్పక్కర్లేదు.

LEAVE A REPLY