చిరు-పవన్‌ సినిమాలో నాగబాబుకు బెర్త్

0
84

mega brothers photos

తమ ప్రవర్తనతో అన్మదమ్ములంటే ఇలా ఉండాలని చూపించారు మెగాబ్రదర్స్  చిరంజీవి, నాగబాబు, పవన్..చిన్న చిన్న అభిప్రాయ భేదాలు మినహా ఇప్పటికీ అన్నదమ్ములది ఒకే మాట. అయితే రీసెంట్‌గా చిరంజీవి, పవన్ కళ్యాణ్‌తో మల్టీస్టారర్ తీస్తున్నట్లు సంచలన ప్రకటన చేశారు ఎంపీ సుబ్బిరామిరెడ్డి. ఆ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి అంచనాలు ఓ రేంజ్‌కు వెళ్లిపోయాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఒకటి ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ఈ సినిమాలో మరో మెగా హీరో నాగబాబు కూడా నటించబోతున్నారంట. ముగ్గురు అన్నదమ్ములు గతంలో శంకర్‌దాదా జిందాబాద్ సినిమాలో కనిపిస్తారు..కానీ ముగ్గురు ఒకేసారి కనిపించరు..అలాంటిది తొలిసారి ముగ్గురిని ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం మెగా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయం. అయితే ఈ వార్తను అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఈ సినిమాను అశ్వీనిదత్‌తో కలిసి సుబ్బిరామిరెడ్డి నిర్మిస్తుండగా..త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారు.

LEAVE A REPLY